lovers: లవర్ తో దొరికిపోయిన కూతురు.. అందరి ముందూ చితకబాదిన తండ్రి.. వీడియో చూడండి!

  • ప్రియుడితో కలసి సినిమా థియేటర్ కు వెళ్లిన కూతురు
  • ఊహించని విధంగా అదే సినిమాకు వచ్చిన తండ్రి
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ప్రేమికులు

గుండెలపై పెట్టుకుని పెంచిన కన్నకూతురు చేస్తున్న నిర్వాకం చూసిన తండ్రి గుండె బద్దలైంది. తన పెంపకానికే మచ్చ తెచ్చేలా చేసిన కూతురును, అందరూ చూస్తుండగానే చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే, సదరు కూతురు తన ప్రియుడితో కలసి సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లింది. ఊహించని విధంగా అదే థియేటర్ కు ఆమె తండ్రి వచ్చాడు. ప్రియుడితో ఉన్న కూతురును చూసిన ఆ కన్నతండ్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతావని తాము ఆశపడుతుంటే... నీవు చేసే నిర్వాకం ఇదా? అంటూ మండిపడ్డాడు. ప్రేమికులిద్దరినీ పరుషపదజాలంతో దూషించాడు. చుట్టుపక్కల ఉన్నవారు ఆయనను శాంతపరిచేందుకు యత్నించినప్పటికీ... ఆయనలోని ఆగ్రహం చల్లారలేదు. అందరి ముందే కన్నకూతురును చితకబాదాడు. ఈ ఘటన ఆదివారంనాడు వరంగల్ లోని ఎస్2 థియేటర్ వద్ద చోటుచేసుకుంది.

lovers
daughter
father
warangal
beat
  • Error fetching data: Network response was not ok

More Telugu News