amaravathi bonds: సంప్రదాయ పద్ధతిలో అమరావతి బాండ్లను లిస్టింగ్ చేస్తారు: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

  • రేపు బీఎస్ఈలో లిస్టింగ్ కానున్న అమరావతి బాండ్లు
  • అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడతారు
  • ఇన్వెస్టర్లతోనూ బాబు సమావేశమవుతారు

రేపు ఉదయం 9.15 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో అమరావతి బాండ్లు లిస్టింగ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ, సంప్రదాయ పద్ధతిలో అమరావతి బాండ్లను లిస్టింగ్ చేస్తారని తెలిపారు. అనంతరం ఇన్వెస్టర్లు, మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. 

ఈ సమావేశంలో రిలయన్స్, గోద్రెజ్ సంస్థల అధినేతలు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని అన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, అందుకే వేర్వేరు మార్గాల ద్వారా నిధులు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి బాండ్లపై అవగాహనలేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని, బాండ్లలో కరప్షన్ కు ఆస్కారం ఉండదని అన్నారు. 

  • Loading...

More Telugu News