rajnathh: కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ
- ఇద్దరు మంత్రులను వేర్వేరుగా కలిసిన కేసీఆర్
- రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చ
- రాజ్ నాథ్ కు కృతఙ్ఞతలు చెప్పిన కేసీఆర్
ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్రహోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలను ఈరోజు వేర్వేరుగా కలిశారు. తెలంగాణ కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో చొరవ చూపినందుకు రాజ్ నాథ్ సింగ్ కు కేసీఆర్ కృతఙ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపైనా చర్చించారు.
కాగా, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసిన కేసీఆర్ మూడు వినతి పత్రాలు సమర్పించారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని, వార్షిక రుణపరిమితిని మరో 0.50 శాతం పెంచాలని, ఎఫ్ఆర్బీఎమ్ అదనపు నిధులు సమకూర్చాలని, డ్వాక్రా సంఘాలకు ఇచ్చే వడ్డీ రాయితీలో కేంద్ర ప్రభుత్వ వాటాను విడుదల చేయాలని కేసీఆర్ కోరారు.