marri sasidhar reddy: కోదండరామ్ పార్టీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు

  • తెలంగాణ జన సమితి పార్టీలో చేరిన ఆదిత్యరెడ్డి
  • సాదరంగా ఆహ్వానించిన కోదండరామ్
  • ప్రగతి నివేదన సభకు అధికార యంత్రాగాన్ని వాడుకోరాదని డిమాండ్

కోదండరామ్ స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి చేరారు. ఆయనకు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు కోదండరామ్. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, సేవా దృక్పథం ఉన్నవారు పార్టీలోకి రావడం మంచి పరిణామమని చెప్పారు.

ఇక టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2న తలపెట్టిన ప్రగతి నివేదన సభకు అధికార యంత్రాగాన్ని వాడుకోరాదని ఆయన డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సభలు ఎవరు పెట్టినా, ఏ పార్టీ పెట్టినా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.


marri sasidhar reddy
aditya reddy
tjs
Kodandaram
  • Loading...

More Telugu News