kavitha: అన్నకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్న కవిత.. వీడియో చూడండి

  • కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత
  • అన్నకు హెల్మెట్ బహూకరణ
  • ప్రతి సోదరి తన సోదరులకు హెల్మెట్ ను బహూకరించాలంటూ పిలుపు

రక్షాబంధన్ సందర్భంగా తన అన్న కేటీఆర్ కు ఎంపీ కవిత రాఖీ కట్టారు. ఆనంతరం అన్నయ్య పాదాలకు నమస్కరించి, ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు హెల్మెట్ ను బహూకరించారు కవిత. 'సిస్టర్ ఫర్ ఛేంజ్' కార్యక్రమం ద్వారా ప్రతి సోదరి తన సోదరులకు హెల్మెట్ కానుకగా ఇవ్వాలని కవిత ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. హెల్మెట్ ను ఇవ్వడం ద్వారా సోదరుల ప్రాణాలను కాపాడే విషయంలో తమ వంతు పాత్ర పోషించాలని కవిత పిలుపునిచ్చారు. 

kavitha
KTR
raksha bandhan
  • Error fetching data: Network response was not ok

More Telugu News