Silly Fellows: 'మణిగంధం బహిర్ముఖం... సారీ మిస్టర్‌ రాజమౌళి' అంటున్న 'సిల్లీ ఫెలోస్'... ట్రైలర్ ను విడుదల చేసిన మహేశ్ బాబు!

  • రాఖీ పౌర్ణమి సందర్భంగా ట్రైలర్  విడుదల
  • నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేశ్, సునీల్
  • అంచనాలు పెంచిన ట్రైలర్ 

కామెడీ స్టార్లు అల్లరి నరేష్, సునీల్ లు కలసి నటించిన 'సిల్లీ ఫెలోస్' ట్రైలర్ ను రాఖీ పౌర్ణమి సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఈ ఉదయం విడుదల చేశారు. ట్రైలర్ చూడగానే, ఇది కామెడీ క్రైమ్ చిత్రమని తెలిసిపోతుంది. అల్లరి నరేష్, సునీల్ జోడీ ట్రైలర్ లోనే నవ్వులు పండించారు. తన పెళ్లిని గురించి ఆలోచిస్తూ, "ఒక విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ. ఒక వీరబాబు, వాసంతి..ఆహా" అనడం, ఆపై 'అర్జున్ రెడ్డి', 'ఆర్ఎక్స్ 100' సినిమాల్లోని లిప్ లాక్ సీన్లపై వేసిన పంచ్ లు ట్రైలర్ లో పేలాయి.

 నరేశ్, హీరోయిన్ ఫైట్ చేస్తూ, "మణిగంధం బహిర్ముఖం" అంటూ 'బాహుబలి' డైలాగ్‌ చెప్పగానే, పోసాని కృష్ణమురళి నోటి నుంచి 'సారీ మిస్టర్‌ రాజమౌళి' అని వినిపించడం ఆకట్టుకుంటోంది. ఎక్స్ రేను చూసి స్కానింగ్ రిపోర్టు ఏం చెబుతోందని బ్రహ్మానందం అడగటం నవ్వులు పూయిస్తోంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. దాన్ని మీరూ చూసేయండి.

Silly Fellows
Rakhi Pournami
Mahesh Babu
Allari Naresh
Sunil
  • Error fetching data: Network response was not ok

More Telugu News