Donald Trump: పని మనిషితో ట్రంప్ కు అక్రమ సంతానం!

  • ట్రంప్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన పని మనిషి
  • వెల్లడించిన ట్రంప్ టవర్ మాజీ కాపలాదారుడు
  • అమెరికన్ మీడియా ఇంక్ తో ఒప్పందం వల్ల ఇంత కాలం వెలుగు చూడని వాస్తవం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పలు లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న ట్రంప్ కు... అక్రమ సంతానం కూడా ఉందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ట్రంప్ వరల్డ్ టవర్ మాజీ కాపలాదారుడు ఒకరు వెల్లడించారు.

పెళ్లి చేసుకోకుండానే ఓ పని మనిషితో ట్రంప్ సంబంధం పెట్టుకున్నారని... ట్రంప్ ద్వారా ఆమెకు ఓ బిడ్డ జన్మించిందని డినో సాజుదిన్ అనే కాపలాదారుడు తన న్యాయవాది ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదని అమెరికన్ మీడియా ఇంక్ తో తన క్లయింట్ డినో ఒప్పదం కుదుర్చుకున్నాడని... ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటపడ్డాడని సదరు న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై వైట్ హౌస్ ఇంతవరకు స్పందించలేదు.

Donald Trump
america
president
illegal
child
  • Loading...

More Telugu News