priya bhavani shankar: సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమే: నటి ప్రియ

  • అంగీకరించడం, నిరాకరించడం మన చేతుల్లోనే ఉంటుంది
  • శ్రీరెడ్డి బహిరంగంగా చెప్పడం తప్పు
  • కుటుంబ కథాచిత్రాలకే నేను ప్రాధాన్యతను ఇస్తున్నా

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం ఇంకా సద్దుమణగనే లేదు... వర్ధమాన నటి ప్రియ భవాని శంకర్ మరోసారి పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశాన్ని లేవనెత్తింది. బుల్లితెరపై ఇప్పటిదాకా సందడి చేసిన ప్రియ, ఇప్పుడిప్పుడే వెండి తెరపై బిజీ అవుతోంది. ఇలీవలే కార్తీకి జంటగా ఓ చిత్రంలో నటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమేనని స్పష్టం చేసింది.

ఈ వేధింపులు అన్ని రంగాల్లో ఉన్నాయని ప్రియ చెప్పింది. అయితే, వాటిని అంగీకరించడం, నిరాకరించడం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. లైంగిక వేధింపుల గురించి శ్రీరెడ్డి బహిరంగంగా చెప్పడం సరికాదని చెప్పింది. తప్పు చేసి, బయటకు చెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. వేధింపుల బారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు కదా అని తెలిపింది. తాను మాత్రం కుటుంబకథా చిత్రాలకే ప్రాధాన్యతను ఇస్తున్నానని చెప్పింది. 

priya bhavani shankar
tollywood
kollywood
Casting Couch
sri reddy
  • Loading...

More Telugu News