Chandrababu: ఢిల్లీలోనే కేసీఆర్... ముంబైకి వెళ్లనున్న చంద్రబాబు!

  • కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలతో భేటీ కానున్న కేసీఆర్
  • ఈ సాయంత్రం ముంబైకి చేరుకోనున్న చంద్రబాబు
  • రేపు ఏపీ బాండ్ల లిస్టింగ్ ను ప్రారంభించనున్న సీఎం

నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై, జోనల్ వ్యవస్థ, ముందస్తు ఎన్నికలపై చర్చలు జరిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, నేడు కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, ఇతర విభజన హామీల అమలుపై ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం కానున్నారు. ఆపై ఆయన మరో మంత్రి నితిన్ గడ్కరీతోనూ భేటీ కానున్నారు.

ఇదిలావుండగా, ఏపీ సీఎం చంద్రబాబు నేడు ముంబై బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం ముంబై చేరుకునే ఆయన, రేపు ఉదయం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఇటీవల విక్రయించిన ఏపీ బాండ్ల లిస్టింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రారంభానికి సూచనగా సంప్రదాయ గంటను ఆయన మోగించనున్నారు. అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీయే ఆధ్వర్యంలో గత వారంలో బాండ్లను విక్రయానికి పెట్టగా, మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

Chandrababu
KCR
New Delhi
Arun Jaitly
Nitin Gadkari
Mumbai
AP Bonds
CRDA
  • Loading...

More Telugu News