chaitu: 'శైలజా రెడ్డి అల్లుడు' ఆ రోజున వస్తున్నాడు

- మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
- వినాయక చవితికి విడుదల
మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం రూపొందింది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కేరళలో రీ రికార్డింగ్ చేస్తోన్న గోపీ సుందర్, వరదల కారణంగా సకాలంలో తన పనిని పూర్తిచేయలేకపోయాడు.
