YSRCP: కేరళకి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే!

  • వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కోటి రూపాయల విరాళం
  • ఈ నెల 28, 29 తేదీల్లో కేరళలో పర్యటన
  • చెక్‌ను కేరళ ముఖ్యమంత్రికి అందజేయనున్న గౌతమ్ రెడ్డి

కేరళ వరద బాధితులని ఆదుకునేందుకు కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత, వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ముందుకొచ్చారు. తన సంస్థ తరఫున కోటి రూపాయల విరాళాన్ని కేరళ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 28, 29 తేదీల్లో కేరళలో గౌతమ్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని కలిసి విరాళం చెక్‌ను స్వయంగా అందజేయనున్నట్లు తెలిపారు. తాను ప్రకటించిన విరాళాన్ని వరద బాధితుల పునరావాసం కోసం వినియోగించాలని కోరతానని అన్నారు. కాగా, వైసీపీ అధినేత జగన్ కొన్నిరోజుల క్రితమే తన పార్టీ తరపున కేరళకి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

YSRCP
mla
Mekapati Goutham Reddy
Jagan
Kerala
Andhra Pradesh
  • Loading...

More Telugu News