keerthi suresh: 'జయలలిత'గారిలా నటించడం అంత తేలిక కాదు .. అంత ధైర్యమూ నాకు లేదు!: కీర్తి సురేశ్

  • జయలలిత గారు గొప్ప నటి
  • అంతకు మించిన నాయకురాలు
  • ఆమె పాత్ర కోసం ఎవరూ సంప్రదించలేదు  

అందాల కథానాయికగా .. అసమానమైన ప్రతిభాపాటవాలు కలిగిన రాజకీయ నాయకురాలిగా జయలలిత ప్రజల హృదయాలపై చెరగని ముద్రవేశారు. అలాంటి జయలలిత బయోపిక్ ను రూపొందించడానికి ఇద్దరు .. ముగ్గురు దర్శకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. జయలలిత పాత్రకి తగిన కథానాయిక కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'మహానటి'లో సావిత్రిగా అద్భుతంగా నటించిన కీర్తి సురేశ్ ను ఒక దర్శకుడు ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ విషయాన్ని గురించి కీర్తి సురేశ్ స్పందిస్తూ .. "ఇంతవరకూ ఈ పాత్రను గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. జయలలితగారు గొప్పనటి .. అంతకు మించిన గొప్ప నాయకురాలు. అలాంటి జయలలిత గారిలా నటించడం అంత తేలికైన విషయం కాదు .. అంత ధైర్యం కూడా నాకు లేదు" అన్నారు. ప్రస్తుతం కేరళ వరద బాధితులకి సహాయ సహకారాలను అందించే పనుల్లో తాను ఉన్నాననీ, నిరాశ్రయులైనవారిని చూస్తున్నప్పుడు తనకి చాలా బాధ కలుగుతోందని చెప్పారు. 

keerthi suresh
  • Loading...

More Telugu News