aravind swami: అదరగొట్టేస్తోన్న 'నవాబ్' ట్రైలర్

  • మణిరత్నం నుంచి 'నవాబ్'
  • యాక్షన్ .. ఎమోషన్ కి పెద్దపీట
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో 'చెక్క చివంత వానం' సినిమా రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాను 'నవాబ్' పేరుతో విడుదల చేయనున్నారు. మద్రాస్ టాకీస్ .. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా నాగార్జున చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలైన అరవింద్ స్వామి .. శింబు .. విజయ్ సేతుపతి .. అరుణ్ విజయ్ .. జ్యోతిక .. అదితీరావు .. ప్రకాశ్ రాజ్ .. జయసుధ పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 'వరద' పాత్రలో అరవింద్ స్వామిని .. 'త్యాగు' పాత్రలో అరుణ్ విజయ్ ని .. 'రుద్ర' పాత్రలో శింబును .. 'రసూల్' పాత్రలో విజయ్ సేతుపతిని .. 'భూపతి' పాత్రలో ప్రకాశ్ రాజ్ ను ఈ ట్రైలర్ ద్వారా పరిచయం చేశారు. యాక్షన్ కి .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. ప్రతి పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేశారనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News