Uttar Pradesh: యూపీ ఓటర్ల లిస్టు చిత్రాలు.. దుర్గావతి సింగ్ పేరు పక్కన సన్నీ లియోన్ ఫొటో!

  • యూపీలో అధికారుల నిర్వాకం
  • ఓటర్లకు బదులు జంతువుల ఫొటోలు
  • పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

సన్నీలియోన్ ఎవరని అడిగితే కెనడాకు చెందిన మాజీ పోర్న్ స్టార్ అనీ, ఇప్పుడు బాలీవుడ్ లో బీజీ స్టార్ అని టక్కున చెబుతాం. ఇక జింక, ఏనుగు జంతువులని అందరికీ తెలుసు. కానీ ఉత్తరప్రదేశ్ అధికారుల లెక్క మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే వాళ్లు ఓటర్ల జాబితాలోని వ్యక్తులకు సన్నీలియోన్, ఏనుగు, జింక, పావురం ఫొటోలను జతచేశారు.


వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని బల్లియా జిల్లాలో జూలై 15లోపు  ఓటర్ల జాబితాను రూపొందించడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా తయారుచేసిన ఓటర్ల జాబితాలో 51 ఏళ్ల వయసున్న దుర్గావతి సింగ్ అనే మహిళ ఫొటో స్థానంలో సన్నీలియోన్ ఫొటోను, 56 ఏళ్ల వయసున్న మరో వ్యక్తికి ఏనుగు ఫొటోను పెట్టారు. ఈ లిస్ట్ చివరికి మీడియా చేతికి చిక్కడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పట్టణంలో పనిచేస్తున్న ఓ ఆపరేటర్ గ్రామీణ ప్రాంతానికి విధుల నిర్వహణ సందర్భంగా వచ్చి ఈ నిర్వాకం వెలగబెట్టాడని తెలిపారు. ఇంకా ఈ ఓటర్ల జాబితా పరిశీలన స్థాయిలోనే ఉందన్నారు. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ జాబితాను సవరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Uttar Pradesh
Sunny Leone
elephant
  • Loading...

More Telugu News