drunken drive: మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై వీరంగమేసిన యువతులు
- శుక్రవారం రాత్రి నగరంలో ఆరు చోట్ల తనిఖీలు
- మద్యం మత్తులో పోలీసులతో మహిళల వాగ్వాదం
- ఓ టీవీ చానల్ కెమెరామన్‌పై దాడి.. కెమెరా ధ్వంసం
డ్రంకెన్ డ్రైవ్‌లపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాగి వాహనాలు నడుతున్న వారు రోజూ పదుల సంఖ్యలో పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా ఆరు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురు పోలీసులకు చిక్కారు. ఈ క్రమంలో ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా అందులోని మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నడిరోడ్డుపై వీరంగమేశారు.
పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఓ టీవీ చానల్ కెమెరామన్‌పై దాడికి దిగాడు. అతడి కెమెరాను లాక్కుని ధ్వంసం చేశాడు. అడ్డుకోబోయిన పోలీసులపైనా దాడికి దిగాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో మొత్తం 123 వాహనాలను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.