Smartphone: ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం.. పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య

  • ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి
  • చదువుకు ఆటంకం ఏర్పడుతుందని నిరాకరణ
  • పురుగుల మందు తాగి బలవన్మరణం

ఫోన్ కోసం ప్రాణాలు తీసుకున్నాడో విద్యార్థి. ఫోన్ కొనివ్వాలంటూ బతిమాలుతున్నా తల్లిదండ్రులు వినిపించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శివారులోని యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాట్ల నర్సింహ కుమారుడు వంశీ యాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. తన స్నేహితులందరూ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుండడంతో తనకూ కొనివ్వాలని గత కొన్ని రోజులుగా తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే, ఫోన్ కొనిస్తే చదువుకు ఆటంకం ఏర్పడుతుందని భావించిన తల్లిదండ్రులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ శుక్రవారం ఇంట్లోనే పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Smartphone
Hyderabad
Telangana
Yacharam
Suicide
  • Loading...

More Telugu News