TRS: ముగిసిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
- ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలన్న కేసీఆర్
- ప్రగతి నివేదన సభ, తదితర అంశాలపై చర్చ
- సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
తెలంగాణ భవన్ లో ఈరోజు సాయంత్రం ప్రారంభమైన టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలను కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం.
వచ్చే నెల 2న జరగనున్న ప్రగతి నివేదన సభ, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, జగదీష్ రెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వినోద్, సీఎస్ ఎస్ కే జోషి, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాగా, విస్తృతస్థాయి సమావేశం ముగిసిన అనంతరం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధంగా ఉన్నాం - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సీఎం కేసీఆర్ లక్ష్యం బంగారు తెలంగాణ. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుస్థిరంగా ఉంటుంది - ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
వచ్చే నెల 2న జరిగే ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా తరలివస్తారు - ఎమ్మెల్సీ నారదాసు