modi: మోదీ స్థానంలో నేనుంటే.. డోక్లాం సంక్షోభాన్ని ఆపేవాడిని: రాహుల్ గాంధీ

  • డోక్లాంలో ఇప్పటికీ చైనీయులు ఉన్నారు
  • డోక్లాం సంక్షోభాన్ని మోదీ ఒక సంఘటనగానే చూస్తున్నారు
  • పాక్ విషయంలో కూడా ఆయనకు ఎలాంటి వ్యూహం లేదు

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలను తీవ్రతరం చేశారు. చైనాతో నెలకొన్న డోక్లాం సంక్షోభాన్ని మోదీ జాగ్రత్తగా పరిశీలించి ఉంటే... సంక్షోభాన్ని నివారించగలిగి ఉండేవారని ఆయన అన్నారు. ఎంతో సున్నితమైన డోక్లాం సంక్షోభాన్ని మోదీ కేవలం ఒక సంఘటనగానే చూస్తున్నారని విమర్శించారు. చైనాను నిలువరించడంలో మోదీ విఫలమయ్యారని... చైనీయులు ఇప్పటికీ డోక్లాంలోనే ఉన్నారనేది వాస్తవమని చెప్పారు. మోదీ స్థానంలో తాను ఉంటే ఆ సంక్షోభాన్ని ఆపగలిగేవాడినని చెప్పారు.

పాకిస్థాన్ విషయంలో కూడా మోదీకి ఒక పక్కా వ్యూహం అనేది లేదని రాహుల్ విమర్శించారు. మోదీ హయాంలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ నెరవేర్చలేక పోయారని చెప్పారు.

modi
Rahul Gandhi
doklam
Pakistan
  • Loading...

More Telugu News