rashmika: అమ్మాయిలకు అసలైన ఆభరణం అందమే: ‘గీత గోవిందం’ రష్మిక

  • హైదరాబాద్ లో సందడి చేసిన రష్మిక
  • జూబ్లీహిల్స్ లో ఓ షోరూమ్ ను ప్రారంభించిన నటి
  • పట్టుచీరలో మెరిసిపోయిన అందాల నటి

అమ్మాయిలకు అసలైన ఆభరణం అందమేనని ‘గీత గోవిందం’ హీరోయిన్ రష్మిక అభిప్రాయపడింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి ఏర్పాటు చేసిన 'ముగ్ధ' నూతన షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. కంచిపట్టుచీరలో మెరిసిపోయిన రష్మికతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు.

కాగా, నగరానికి చెందిన పలువురు మోడళ్లు సంప్రదాయ కంచిపట్టు చీరలతో ఫ్యాషన్ షోలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డిజైనర్ శశి మాట్లాడుతూ, భారతీయ సంప్రదాయ వస్త్రాలను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ షోరూమ్ ను ప్రారంభించినట్టు చెప్పారు.

rashmika
gita govindam
  • Loading...

More Telugu News