aadi pinishetty: హీరోగానైనా .. విలన్ గానైనా నచ్చితేనే చేస్తా: ఆది పినిశెట్టి

  • బయట జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదు
  • హీరోగా అవకాశాలు వస్తూనే వున్నాయి
  • ప్రాజెక్టులు సెట్ కాకపోవడం వలన గ్యాప్

తెలుగు .. తమిళ భాషల్లో నటుడిగా ఆది పినిశెట్టికి మంచి క్రేజ్ వుంది. అడపా దడపా హీరోగా కనిపిస్తూనే, విలన్ గాను మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. ఇద్దరు హీరోల్లో ఒకరిగా కనిపించడానికి కూడా ఆయన వెనుకాడటం లేదు. హీరోగా ఆయన తాజా చిత్రంగా 'నీవెవరో' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ," హీరోగా నాకు అవకాశాలు రాకపోవడం వలన కేరక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నానని కొంతమంది అంటున్నారు. కేరక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మార్కులు కొట్టేయడం వలన మళ్లీ హీరోగా ఛాన్సులు వస్తున్నాయని మరి కొంతమంది అంటున్నారు. ఈ రెండింటిలోనూ నిజం లేదు. హీరోగా నాకు అవకాశాలు వస్తూనే వున్నాయి. అయితే మంచి కథలు .. నిర్మాతలు సెట్ కాకపోవడం వలన నేను వాటిని వదులుకోవలసి వస్తోంది. ఇక పాత్ర ఏదైనా పెర్ఫెక్ట్ గా .. కొత్తగా ఉందని అనిపిస్తేనే ఓకే చెబుతుంటాను. హీరోగా వరుస సినిమాలు చేయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని నేను భావిస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.        

aadi pinishetty
  • Loading...

More Telugu News