నాకే ఫైన్ వేస్తావా?.. అంటూ రచ్చ చేసిన మధ్యప్రదేశ్ సీఎం 'బావమరిది'!
- మధ్యప్రదేశ్ విధానసభ ముందు ఓ వ్యక్తి రచ్చ
- ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫైన్ విధించిన పోలీసులు
- రాష్ట్రంలో నాకు కోట్లాది మంది బావ, బావమరదులు ఉన్నారంటూ చమత్కరించిన శివరాజ్ సింగ్ చౌహాన్
ముఖ్యమంత్రి బావమరిదిని... నాకే ఫైన్ వేస్తారా? అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. రోడ్డు మీదే ఆందోళనకు దిగాడు. అంతేకాదు, పోలీసులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో, పోలీసులు షాక్ అయ్యారు. నిజంగానే సీఎం బావమరిదేమో అని... తడబాటుకు గురయ్యారు. మధ్యలో మరికొంత మంది పోలీసులు వచ్చి, గొడవను తగ్గించారు.
ఈ విషయం చివరకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు వెళ్లింది. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తనకు కోట్లాది మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారని... వారి భర్తలంతా తనకు బావ, బావమరదులే అవుతారని చమత్కరించారు.