football star: కేరళ రిలీఫ్ క్యాంపులో కూలీలా పనిచేస్తున్న ఫుట్‌బాల్ స్టార్.. దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్న వినీత్!

  • బాధితుల సేవలో తరిస్తున్న వినీత్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
  • లక్షలాదిమంది హృదయాలను గెలుకున్న స్టార్ ఆటగాడు

ఇండియన్ ఫుట్‌బాట్ జట్టు ఆటగాడు, కేరళ బ్లాస్టర్స్ స్టార్ సీకే వినీత్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయక శిబిరాల్లో పనిచేస్తూ బాధితులకు సేవలు అందిస్తున్నాడు. కొచ్చి రీజనల్ స్పోర్ట్స్ సెంటర్‌లో ఓ పోర్టర్‌లా పనిచేస్తూ సామాన్లను లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తూ కనిపించాడు. శిబిరంలో చురుగ్గా ఉంటూ బాధితుల సేవలో తరిస్తున్నాడు.

కేరళ బ్లాస్టర్స్ తరపున ఆడుతున్న వినీత్ ఎదిగి ఉన్నా ఒదిగి ఉండాలన్న మనస్తత్వం కలవాడు. కేరళ యువకులకు రోల్ మోడల్ అయిన వినీత్ రిలీఫ్ క్యాంపులో కూలీలా పనిచేస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన అభిమాని ఒకరు ‘డార్లింగ్ ఆఫ్ మిలియన్’ అని కామెంట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు వినీత్ లాంటి వారు మరింతమంది అవసరమని చెబుతున్నారు. బాధితుల బాధను పంచుకోవడంలో ముందున్న వినీత్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని కితాబిస్తున్నారు.

football star
CK Vineeth
Kerala flood
victims
  • Loading...

More Telugu News