Andhra Pradesh: ఏపీలో మందగించిన రుతుపవనాలు.. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

  • ఏపీలో పొడి వాతావరణం
  • రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు
  • 26న అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రుతుపవనాలు మందగించడం, రుతుపవన ద్రోణి ఉత్తరాదికి మళ్లడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా లేకపోవడంతో ఎండలు కాస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండడంతో రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణం ఉంది.

గురువారం తిరుపతి, నెల్లూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, వచ్చే 24 గంటల్లో మాత్రం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Andhra Pradesh
Tirupati
Rayalaseema
Rains
Sun
  • Loading...

More Telugu News