Nannapaneni: అలా అన్న వారిని ఉరితీయాలన్న నన్నపనేని రాజకుమారి

  • సంచలన వ్యాఖ్యలు చేసే నన్నపనేని 
  • మహిళలు ఆలయంలోకి వెళ్ళటమే కేరళ వరదలకు కారణమా?
  • అలా అన్నవారిని ఉరి తీయాలన్న రాజకుమారి

ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఏం మాట్లాడినా ముక్కుసూటిగా, సంచలనంగా వుంటుంది. తాజాగా కూడా ఆమె అలాంటి వ్యాఖ్యలే చేశారు. మహిళలు కొన్ని ఆలయాలలోకి వెళ్లడం వల్లే కేరళలో వరదలు వచ్చాయంటూ కొందరు కామెంట్లు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. అలా అన్నవాళ్లను ఉరి తీయాలని నన్నపనేని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 ఈ రోజు ఆమె నెల్లూరులో మాట్లాడుతూ, ఈ జిల్లా జైలులో మహిళా ఖైదీలు ఎక్కువగా వున్నారని, మహిళల్లో హింసను ప్రేరేపించేవిగా నేటి సీరియల్స్ ఉంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్స్ చూసి మహిళలు కోపోద్రేకాలకు గురవుతూ నేరాలకు పాల్పడుతున్నారన్న ఆమె, సీరియల్స్ ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

Nannapaneni
Telugudesam
  • Loading...

More Telugu News