Pawan Kalyan: పవన్ కల్యాణ్ కంటికి ఇన్ఫెక్షన్.. మరోసారి శస్త్ర చికిత్స

  • పవన్ కంటికి నెల రోజుల కింద‌ట ఓ ఆప‌రేష‌న్
  • ఇన్ ఫెక్షన్ సోకడంతో మరోసారి ఆపరేషన్ చేశారు
  • ‘జనసేన’ మీడియా హెడ్ హరిప్రసాద్

కొన్ని నెల‌లుగా కంటి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఈరోజు మ‌రోసారి శస్త్ర చికిత్స జ‌రిగింది. హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని ‘సెంట‌ర్ ఫ‌ర్ సైట్’ కంటి ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స నిర్వహించినట్టు జనసేన’ మీడియా హెడ్ పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

పవన్ కల్యాణ్ కు డాక్ట‌ర్ సంతోష్ జి.హోనావ‌ర్ ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారని, డాక్ట‌ర్ జి.వి.ఎస్.ప్ర‌సాద్ ప‌ర్య‌వేక్షించారని తెలిపారు. గ‌త‌ నాలుగు నెలలుగా కంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న పవన్ కల్యాణ్ కు నెల రోజుల కింద‌ట ఓ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారని, అయితే త‌గినంత విశ్రాంతి తీసుకోక‌పోవ‌డంతో కంటికి ఇన్ఫెక్షన్ సోకిందని అన్నారు. దీంతో, పవన్ కు మ‌రోసారి ఆప‌రేష‌న్ నిర్వహించారని, త‌గినంత విశ్రాంతి తీసుకోవాల‌ని ఆయనకు వైద్యులు సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Pawan Kalyan
eye surgery
  • Loading...

More Telugu News