vajpayee: వాజ్ పేయి సంతాప సభను అపహాస్యంపాలు చేసిన బీజేపీ మంత్రులు

  • రాయ్ పూర్ లో బుధవారం జరిగిన వాజ్ పేయి సంతాప సభ
  • జోకులేసుకుంటూ, నవ్వుకున్న మంత్రులు
  • దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

దివంగత వాజ్ పేయి సంతాప సభలో ఛత్తీస్ గఢ్ బీజేపీ మంత్రులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. రాయ్ పూర్ లో బుధవారం వాజ్ పేయి సంతాపసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. అందరూ బరువెక్కిన గుండెలతో మహానేతకు నివాళులర్పించారు.

కానీ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అజయ్ చంద్రకర్, వ్యవసాయ శాఖ మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ మాత్రం నవ్వుతూ, సభను అపహాస్యంపాలు చేశారు. వారిద్దరూ జోకులేసుకుంటూ, నవ్వుకుంటున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై, వైరల్ అవుతున్నాయి. వీరిద్దరిపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన వాజ్ పేయికి ఆ పార్టీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై బీజేపీ ఇంతవరకు స్పందించలేదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News