tej pratap yadav: బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది: తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపణ

  • తేజ్ ప్రతాప్ చేతిని పట్టుకున్న ఆయుధాలు కలిగిన వ్యక్తి
  • గమనించి కేకలు వేసిన డ్రైవర్
  • తనను చంపేందుకు బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర చేశాయన్న తేజ్ ప్రతాప్

బీజేపీ, ఆరెస్సెస్ లు తనను చంపేందుకు కుట్ర చేశాయంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహువాలో ఈద్ సందర్భంగా తాను ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో, ఆయుధాలు కలిగిన ఓ వ్యక్తి తన చేతిని పట్టుకున్నాడని ఆయన తెలిపారు. ఇది ముమ్మాటికీ తన హత్యకు కుట్రేనని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులకే రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఆయుధాలు కలిగిన వ్యక్తి తేజ్ ప్రతాప్ చేతిని పట్టుకున్న విషయాన్ని తొలుత అతని డ్రైవర్ గుర్తించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గట్టిగా అరవడంతో అందరూ అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.

మరోవైపు, తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, తేజ్ ప్రతాప్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, తమ్ముడు తేజశ్వి యాదవ్ రాజకీయంగా అతనికన్నా ఎదుగుతుండటంతో నిరాశలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు.

tej pratap yadav
armed man
rjd
lalu prasad yadav
  • Loading...

More Telugu News