Kerala: కేరళకు విదేశాలు చేసే సాయానికి కేంద్రం నో!

  • యూఏఈ రూ.700 కోట్ల తిరస్కరణ
  • సంఫీుభావం చాలు ...ఆర్థిక సాయం వద్దని స్పష్టీకరణ
  • అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేరళ ప్రభుత్వం

వరద తాకిడితో కకావికలమైన కేరళ రాష్ట్రానికి విదేశాలు అందించే ఆర్థిక సాయానికి కేంద్రం నో చెప్పింది. బాధితులను ఆదుకునేందుకు దేశీయ సంస్థలతోపాటు పలు దేశాలు సాయానికి ముందుకు వస్తున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఏకంగా రూ.700 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. థాయ్‌లాండ్‌తోపాటు మరికొన్ని దేశాలు ముందుకు వచ్చినా కేంద్రం సున్నితంగా తిరస్కరించింది.

 ‘మీ సంఫీుబావం చాలు...ఆర్థిక సాయం వద్దు’ అంటూ వినమ్రంగా తెలిపింది. 2004 సునామీ సందర్భంగా, ఉత్తరాఖండ్‌ వరదల సమయంలోనూ విదేశీ సాయానికి నో చెప్పింది. దశాబ్దకాంగా అనుసరిస్తున్న విధానాన్నే కేరళ విషయంలోనూ అనుసరించాలని కేంద్రం నిర్ణయించింది.

అయితే, కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ దీనిపై మరోలా స్పందించారు. ‘ఎమిరేట్స్‌ అభ్యున్నతిలో కేరళీయు పాత్ర ఎంతో ఉంది. వారిచ్చిన సాయాన్ని తీసుకోవడంలో తప్పులేదు. ఇతర దేశాలతో యూఏఈని పోల్చకూడదు’ అన్నారు. విపత్తు సమయంలో ఏ దేశమైనా స్వచ్ఛందంగా ఇచ్చే సాయాన్ని తీసుకోవచ్చని జాతీయ విపత్తు నిర్వహణ విధానం (ఎన్‌డీఎంపీ)కు 2016లో చేసిన సవరణను కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐసాక్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News