janasena: జనసేన ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్!

  • సెప్టెంబర్ 12 నుంచి ఎన్నికల ప్రచారం
  • విజన్ డాక్యుమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ప్యాక్ కు పవన్ ఆదేశం
  • గ్రామ స్థాయి వరకు కేడర్ ను సన్నద్ధం చేయాలంటూ సూచన

2019 ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే 12 అంశాలతో కూడిన జనసేన విజన్ డాక్యుమెంట్ ప్రజల మన్ననలు పొందుతోంది. ఈ నేపథ్యంలో విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్)ను జనసేనాని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

సెప్టెంబర్ 12 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు. ఈ ప్రచారాన్ని ఎన్నికల వరకు కొనసాగించాలని మార్గనిర్దేశం చేశారు. ప్రచారం కోసం ఉపయోగించుకోవాల్సిన మాధ్యమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గ్రామ స్థాయి వరకు కేడర్ ను సర్వ సన్నద్ధం చేయాలని శ్రేణులకు సూచించారు. 

janasena
election
campaign
Pawan Kalyan
  • Loading...

More Telugu News