2gud: ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త ప్లాట్‌ఫాం.. రీ యూజ్డ్ గూడ్స్ స్టోర్!
- 2 గుడ్ పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్ ఫ్లాట్‌పాం
- పాతవస్తువులకు మరమ్మతులుచేసి మళ్లీ వినియోగంలోకి
- 3 నుంచి 12 నెల వారంటీతో అమ్మకం
భారత్‌లో అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ మాల్ ఫ్లిప్‌కార్ట్ 'సెకండ్స్' అమ్మకాలకు ప్రత్యేక స్టోర్ ఓపెన్ చేసింది. మరమ్మతుకు గురైన వాటిని బాగుచేసి (రిఫర్బిష్‌డ్) 3 నుంచి 12 నెల వారంటీతో అమ్మకాలకు ‘2గుడ్’ పేరుతో ప్రత్యేక ప్లాట్‌ఫాం అందుబాటులోకి తెచ్చింది.
స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అందుబాటులో ఉంచుతున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్టమూర్తి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గూడ్స్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వారంటీతోపాటు విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. పునర్వినియోగ వస్తువులకు అపార మార్కెట్ అవకాశం ఉన్నప్పటికీ, సమస్యలు కూడా ఉన్నాయని ఫ్లిప్‌కార్డు ఉపాధ్యక్షుడు అనిల్ గోటేటి అన్నారు.