tollywood: రేపు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్న నాలుగు తెలుగు సినిమాలు!

  • ఇటీవల విడుదలై విజయం సాధించిన గూఢచారి, ఆర్ఎక్స్ 100, చిలసౌ, గీతగోవిందం
  • రేపు విడుదల కానున్న మరో నాలుగు సినిమాలు
  • బరిలో నీవెవరో, ఆటగాళ్లు, అంతకుమించి, లక్ష్మీ చిత్రాలు

ఈ ఏడాది టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. భరత్ అనే నేను, రంగస్థలం, మహానటి వంటి చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజైన చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇటీవల విడుదలైన గూఢచారి, ఆర్ఎక్స్ 100, చిలసౌ, గీతగోవిందం చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. మరోవైపు, రేపు (శుక్రవారం) మరో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. నీవెవరో, ఆటగాళ్లు, అంతకుమించి, లక్ష్మీ చిత్రాలు రేపు విడుదల కాబోతున్నాయి.

'ఆటగాళ్లు' చిత్రంలో నారా రోహిత్, జగపతిబాబులు ప్రధాన పాత్రలను పోషించారు. 'నీవెవరో' సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ లు జంటగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండగా... ప్రభుదేవా నటించిన 'లక్ష్మీ' చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. 'అంతకుమించి' చిత్రంలో రష్మి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News