Jagtial District: ఆంజనేయస్వామి గుడిలో 15 పాములు.. భీతిల్లిన భక్తులు
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఉన్న అభయహనుమాన్ ఆలయంలో పాములు
- పాములు పట్టే బాబా అనే వ్యక్తిని పిలిపించిన స్థానికులు
- పాములను ప్లాస్టిక్ సంచుల్లో బంధించి, శివారుల్లో వదిలిన బాబా
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఉన్న అభయహనుమాన్ ఆలయం వద్ద కలకలం రేగింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 పాములు ఆలయ పరిసరాల్లో ఉండటంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వీటిలో విషపూరితమైన నాగుపాములు, తాడిజెర్రి, కట్లపాములు కూడా ఉన్నాయి. పాములు సంచరిస్తుండటాన్ని గమనించిన భక్తులు సుల్తాన్ పూర్ కు చెందిన పాములు పట్టే బాబా అనే వ్యక్తిని పిలిపించారు. ఆయన అక్కడకు వచ్చి పాములు పట్టుకున్నారు. స్థానిక యువకులు కూడా ఈ సందర్భంగా ఆయనకు సహకరించారు. మొత్తం 15 పాములను ప్లాస్టిక్ సంచుల్లో బంధించారు. ఆ తర్వాత పట్టణ శివారులోకి తీసుకెళ్లి వాటిని వదిలేశారు. ఆలయ సమీపంలో పాముల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు.