Bakrid: లక్నో ముస్లింల వినూత్న బక్రీద్.. బక్రీ లేకుండానే ఈద్!

  • ముస్లిం సంస్థ పిలుపునకు అనూహ్య స్పందన
  • బహిరంగ ప్రదేశాల్లో మేకలను బలివ్వడంపై ప్రభుత్వం నిషేధం
  • మేకకు బదులు కేక్‌లు కట్ చేసిన వైనం

బక్రీద్ అంటేనే మేకలను బలిచ్చి ఘనంగా చేసుకునే పండుగ. అలాంటి పండుగ రోజున ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ముస్లింలు కొందరు వినూత్నంగా ఆలోచించారు. మేకలను బలివ్వడానికి బదులు మేక ఆకారంలో ఉన్న కేకులను బలిచ్చి (కట్ చేసి) బక్రీద్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఆరెస్సెస్ అనుబంధ ముస్లిం ఆర్గనైజేషన్ ఒకటి ఇచ్చిన పిలుపు మేరకు ముస్లింలు ఇలా కేక్‌లు కట్ చేసి బక్రీద్ జరుపుకున్నారు. పండుగ పేరుతో జంతువులను బలివ్వడం తగదని, అంతగా కావాలనుకుంటే మేక ఆకారంలో ఉన్న కేకును తయారు చేయించి కట్ చేసుకోవాలని ఆ సంస్థ కన్వీనర్ ఇచ్చిన పిలుపుకు ముస్లింలు బాగానే స్పందించారు. చాలామంది ఇలాగే కేక్‌లను కట్ చేసి పండుగ జరుపుకున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో జంతువులను బలివ్వకుండా చూడాలని, అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మేకలను బలివ్వడాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు నిషేధించింది. తాజాగా ముస్లిం ఆర్గనైజేషన్ కూడా పిలుపునివ్వడంతో ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలలో చాలామంది కేకులను కట్ చేసి ఈద్ జరుపుకున్నారు. మేక ఆకారంలో ఉన్న కేకులను కట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News