Rahul Gandhi: మోదీని ఆలింగనం చేసుకోవడం మా పార్టీలోనే కొందరికి నచ్చలేదు!: జర్మనీలో రాహుల్

  • మోదీతో ఆలింగనంపై హాంబర్గ్‌లో రాహుల్ వ్యాఖ్యలు
  •  విద్వేషపూరిత వ్యాఖ్యలకు అలా సమాధానం ఇచ్చానన్న రాహుల్
  • మహిళలను చూసే దృష్టి కోణం మారాలన్న కాంగ్రెస్ చీఫ్

ప్రధాని నరేంద్రమోదీ తనపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటే తాను మాత్రం ఆయనను ఆలింగనం చేసుకుని తన ప్రేమను చాటిచెప్పినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ‘యంగ్ లీడర్స్’ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మహిళలను చూసే దృష్టి కోణం మారాలన్నారు. భారత్‌లో అసహనం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను, మైనార్టీలను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. మహిళలను తమతో సమానంగా చూసే అలవాటు భారత్‌లోని పురుషులకు లేదన్నారు.

విద్వేషానికి విద్వేషమే సమాధానం కాదన్న రాహుల్.. అన్నింటికన్నా క్షమాగుణమే గొప్పన్నారు. హింసకు తన తండ్రి, నానమ్మ బలయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను ప్రధాని మోదీని ఆలింగనం చేసుకోవడం తన పార్టీలోనే కొందరికి నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు.

Rahul Gandhi
Narendra Modi
Congress
BJP
Hug
Germany
  • Loading...

More Telugu News