Indigo flight: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. విమానంలో ఏపీ స్పీకర్.. తప్పిన పెను ప్రమాదం!

  • శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన విమానం
  • టేకాఫ్ అయిన అరగంటకే సాంకేతిక సమస్య
  • వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. శంషాబాద్ నుంచి సాయంత్రం 6:42 గంటలకు 68 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం తిరుపతికి బయలుదేరింది. ఈ విమానంలో ఏపీ స్పీకర్ కోడెల, మాజీ మంత్రి ఆనం సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.

విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. వారు అనుమతించడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న 68 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Indigo flight
Hyderabad
shamshabad
Tirupati
Speaker Kodela
Andhra Pradesh
  • Loading...

More Telugu News