Telangana: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

  • బలహీన పడిన అల్పపీడనం
  • కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  •  రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం అధిక వర్షపాతం నమోదు

వాయవ్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం బలహీనంగా మారింది. ఉత్తర మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, ఈ నెల 26న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని తీవ్రతను చూసిన తర్వాత వర్షాలపై ప్రకటన చేస్తామని పేర్కొంది.

కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి బుధవారం వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సగటున 54.11 సెంటీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 64.71 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అంటే సగటు వర్షపాతం కంటే దాదాపు 20 శాతం అధికం. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాధారణం కంటే 63 శాతం వర్షపాతం రికార్డు కాగా, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

  • Loading...

More Telugu News