kcr: రెడ్డి, వెలమ అభ్యర్థులకు ఓటు వేయద్దు!: కంచె ఐలయ్య

  • నక్సలైట్లు ఎన్నికల్లో పాల్గొనాలి  
  • ఎన్నికల ద్వారానే సామాజిక మార్పు సాధ్యం 
  • రెడ్డి, వెలమ అభ్యర్థులకు ఓటు వేయద్దు 

విప్లవకారులు, నక్సలైట్లు సాయుధ పోరాటాన్ని వీడి 2019 ఎన్నికల్లో పాల్గొనాలని సామాజికవేత్త కంచె ఐలయ్య పిలుపునిచ్చారు. టీమాస్‌ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికారం-వివిధ రాజకీయ పార్టీల వైఖరిపై మెదక్ లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై గద్దర్, కేటీఆర్ పై విమలక్క వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అన్నారు.  

అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్య వేదిక టీమాస్‌ కూడా రాష్ట్రంలో ప్రధాన పక్షాలతో పాటు సిద్ధమవుతోందని అన్నారు. సామాజిక మార్పు అన్నది ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బహుజనులకే ఓట్లు వేయాలని, రెడ్డి, వెలమ అభ్యర్థులకు ఓటు వేయవద్దని ఆయన కోరారు.  

kcr
KTR
vimalakka
Gaddar
  • Loading...

More Telugu News