K Kavitha: టీఆర్ఎస్ ఎంపీ కవిత ను కలిసిన బ్రిటిష్ హై కమిషన్ ఉన్నతాధికారులు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-c0675c753abb2a684bd073ab8aa7728c7917c1c7.jpg)
- నిజామాబాద్ లో పర్యటించనున్న నేపధ్యంలో కవితను కలిసిన బ్రిటిష్ హై కమీషన్
- కాకతీయ తోరణం,గొల్లభామ చీరలు, భారతదేశ కోహినూర్ వజ్రం-తెలంగాణా పుస్తక బహూకరణ
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితను బ్రిటీష్ హై కమిషన్ ఉన్నతాధికారులు కైరన్ డ్రాకే, డిప్యూటీ హైకమిషనర్ ఆండ్య్రూ ఫ్లెమింగ్, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ తదితరులు బుధవారం ఆమె నివాసంలో కలిశారు. నిజామాబాద్ లో రెండు రోజుల పాటు వారు పర్యటించనున్న నేపధ్యంలో కవితను కలవడం జరిగింది. నిజామాబాద్ ఎంపీగా తాను చేస్తున్న అభివృద్ధి పనులను గురించి వారికి వివరించిన కవిత పసుపు బోర్డు ఏర్పాటుకు, రైలు సౌకర్యం కల్పించేందుకు తాను చేస్తున్న కృషిని వివరించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-937d355afcef70c82df049dbc45105202492da23.jpg)