mother: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. 17 ఏళ్ల కొడుకును చంపేసిన తల్లి!

  • విజయనగరంలో మాతృత్వానికి మచ్చ తెచ్చే ఘటన
  • ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి కొడుకును హత్య చేసిన తల్లి
  • శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న కుమారుడు

మాతృత్వానికి మచ్చ తెచ్చేలా, సభ్య సమాజం తల దించుకునేలా దారుణానికి ఒడిగట్టింది ఓ తల్లి. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో... 17 ఏళ్ల వయసున్న కన్న కొడుకునే హతమార్చింది. ఈ దారుణ ఘటన విజయనగంలోని గాయత్రీ నగర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, వెంకట పద్మావతి అనే మహిళకు హరి భగవాన్ అనే కుమారుడు ఉన్నాడు. పట్టణంలోని శ్రీచైతన్య కాలేజీలో అతను ఇంటర్ చదువుతున్నాడు. ఇదే సమయంలో పద్మావతి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన సుఖాలకు కొడుకు అడ్డు వస్తున్నాడనే కారణంతో, అతని అడ్డు తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో, అతని ఆహారంలో నిద్రమాత్రలను కలిపి ఇచ్చింది. దీంతో, హరి నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన విజయనగరంలో కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

mother
murder
son
vijayanagaram
  • Loading...

More Telugu News