Telugudesam: టీడీపీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుంది.. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం: సోమిరెడ్డి

  • కాంగ్రెస్ తో టీడీపీకి సంబంధాలు లేవు
  • కేసుల మాఫీ కోసం బీజేపీతో వైసీపీ కుమ్మక్కయింది
  • స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతోంది

ఎలాంటి సిద్ధాంతాలు లేని పార్టీ వైసీపీ అని... టీడీపీని విమర్శించే అర్హత ఆ పార్టీకి లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పని చేస్తుంటే... స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ పాకులాడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని అన్నారు.

రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూడటమే టీడీపీ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి సంబంధాలు లేవని... కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన జగన్ కే ఆ పార్టీతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కేసులను మాఫీ చేయించుకునేందుకు బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఎన్ని యాత్రలు చేసినా వైసీపీ అధికారంలోకి రావడం అసంభవమని చెప్పారు.

Telugudesam
somireddy
jagan
congress
bjp
ysrcp
  • Loading...

More Telugu News