priyanka chopra: ప్రియాంక నిశ్చితార్థంలో మంత్రాలను చక్కగా ఉచ్చరించిన నిక్!

  • కాబోయే అల్లుడిపై ప్రశంసలు కురిపించిన ప్రియాంక తల్లి
  • నిక్ ఎంతో సౌమ్యుడు.. పెద్దల పట్ల గౌరవం ఉన్నవాడు
  • నిశ్చితార్థం కార్యక్రమంలో నిక్ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు

అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిచ్చిన రిసెప్షన్ కు భారీ ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక తల్లి మధు చోప్రా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నిశ్చితార్థం కార్యక్రమంలో నిక్ ఉల్లాసంగా ఉండటమే కాకుండా... సంస్కృత మంత్రాలను కూడా స్పష్టంగా ఉచ్చరించాడని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నిక్ తల్లిదండ్రులు డెనిస్ మిల్లర్, పాల్ కెవిన్ లు ఎంతో ఆనందంగా పాల్గొన్నారని చెప్పారు.

నిక్ కు ఇదంతా కొత్తే అయినప్పటికీ... పురోహితుడు చెప్పిన విధంగా అన్నీ సక్రమంగా చేశాడని మధు చోప్రా తెలిపారు. నిక్ కుటుంబసభ్యులు చాలా మంచి వారని కితాబిచ్చారు. తమ కుటుంబంలోని అందరికీ నిక్ ఎంతగానో నచ్చాడని తెలిపారు. నిక్ ఎంతో పరిణతి కలిగిన వాడని, ఇదే సమయంలో ఎంతో సౌమ్యుడని కితాబునిచ్చారు. పెద్దల పట్ల అతనికి ఎంతో గౌరవభావం ఉందని చెప్పారు.

బాలీవుడ్ నటి, ప్రియాంక కజిన్ పరిణీతి చోప్రా మాట్లాడుతూ, ప్రియాంకకు నిక్ సరైన జోడీ అని తెలిపింది. నిక్ కంటే గొప్ప వ్యక్తిని ప్రియాంక పక్కన తాను ఊహించుకోలేనని చెప్పింది. 

priyanka chopra
nick jonas
engagement
madhu chopra
parineeti chopra
bollywood
  • Loading...

More Telugu News