Kerala: వరద తగ్గినా శాంతించని పంబ... శబరిమలకు రావద్దంటున్న అధికారులు!

  • కాస్తంత శాంతించిన కేరళ నదులు
  • ఇంకా ఉగ్రరూపంలోనే పంబానది
  • నది దాటే మార్గం లేక భక్తుల ఇబ్బందులు

కేరళలో దాదాపు పది రోజుల పాటు ఉద్ధృతంగా ప్రవహించి, రాష్ట్రమంతటినీ అల్లకల్లోలం చేసిన నదులు, ఇప్పుడు కాస్తంత శాంతించినా, పంబా నది మాత్రం ఉగ్రరూపాన్ని ఇంకా వీడలేదు. కాక్కి రిజర్వాయర్ లోకి కొండ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో, శబరిమల ఇంకా వరదముంపులోనే ఉంది. శబరిమల దిగువన పంబా నది దాదాపు 20 అడుగుల ఎత్తులో ప్రవహిస్తూ ఉండటంతో, నది దాటే మార్గం ఇంకా తెరచుకోలేదు. దీంతో భక్తులు ఎవరూ శబరిమలకు రావద్దని అధికారులు కోరుతున్నారు. వస్తున్న భక్తులను నది ముందు అడ్డుకుని వెనక్కు పంపుతున్నారు.

Kerala
Pamba
River
Flood
  • Loading...

More Telugu News