Karimnagar: గుండెపోటేనా? మరేదైనానా? గంగుల ప్రభాకర్ మృతి వెనుక అనుమానాలు!

  • మార్నింగ్ వాక్ కు వెళ్లి మరణించిన ప్రభాకర్
  • మరణంపై టీఆర్ఎస్ అనుమానాలు
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ఈ ఉదయం వాకింగ్ కు వెళ్లి, రోడ్డుపక్కన విగతజీవిగా పడిఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ మృతి వెనుక పలు అనుమానాలను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు రాకపోవడం, నిత్యమూ వ్యాయామం చేస్తూ, దృఢంగా ఉండే ప్రభాకర్, ఇలా వాహ్యాళికి వెళ్లి మరణించడాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు.

ఆయనది గుండెపోటు కారణంగా వచ్చిన సహజ మరణమని భావిస్తున్నప్పటికీ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో ప్రభాకర్ మృతదేహం ఉండగా, ఆ ప్రాంతమంతా టీఆర్ఎస్ కార్యకర్తలతో నిండిపోయింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Karimnagar
Gangula Prabhakar
Gangula kamalakar
Deat
Heart Attack
  • Loading...

More Telugu News