Kerala: కేరళకు రూ.70 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళ హీరో విజయ్!

  • రూ.70 లక్షల విలువైన సామగ్రిని కేరళకు పంపిన విజయ్
  • అభిమాన సంఘాల ద్వారా బాధితులకు నేరుగా పంపిణీ
  • ట్రక్కుల్లో బయలుదేరిన సామగ్రి

కోలీవుడ్ నటుడు విజయ్ కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. తనవంతు సాయంగా రూ.70 లక్షలు ప్రకటించాడు. అయితే, ఈ సాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వలేదు. ఈ సొమ్ముతో తన అభిమాన సంఘాల ద్వారా బాధితులకు నేరుగా సాయం అందేలా ఏర్పాట్లు చేశాడు. కేరళ వరద బాధితుల కోసం విజయ్ ఏకంగా రూ.14 కోట్లు అందించినట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అది ఫేక్ న్యూస్ అని తేలింది.

తాజాగా విజయ్ రూ.70 లక్షల సాయం ప్రకటించడంతో రూ.14 కోట్లు తప్పుడు వార్త అని తేలింది. విజయ్ రూ.70 లక్షల విలువైన సాయాన్ని బాధితులకు అందించేందుకు ఏర్పాట్లు చేశాడు. బాధితుల కోసం ఆహార పదార్థాలు, దుస్తులు, దుప్పట్లు, పాలపొడి, శానిటరీ నేప్‌కిన్లు, మందులు, ఇతర అవసరమైన వస్తువులను వరద ప్రభావానికి గురైన 12 జిల్లాలకు పంపించారు. వీటిని తన అభిమాన సంఘాల ద్వారా బాధితులకు అందజేయనున్నారు.

Kerala
Flood
Kollywood
Vijay
Actor
Tamilnadu
India
  • Loading...

More Telugu News