Andhra Pradesh: వచ్చే నెలలో చంద్రబాబు అమెరికా పర్యటన

  • సెప్టెంబరు 23-27 మధ్య న్యూయార్క్‌లో వ్యవసాయంపై సదస్సు
  • చంద్రబాబుకు అందిన ఆహ్వానం
  • ఏపీలో జీరో బడ్జెట్ వ్యవసాయంపై సీఎం ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 23 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు న్యూయార్క్‌లో వ్యవసాయంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. వ్యవసాయంలో పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

 ఇందులో పాల్గొనాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఏపీలో అమలు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయం, సాగులో అధునాతన విధానాల గురించి సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని ‘పరిశ్రమలు 4.0’ అనే నివేదికను విడుదల చేయనున్నారు.

Andhra Pradesh
Chandrababu
America
Agriculture
India
Newyork
  • Loading...

More Telugu News