‘ఇదం జగత్’ టీజర్ ని విడుదల చేసిన వైఎస్ జగన్
- సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇదం జగత్’
- విడిది శిబిరంలో టీజర్ విడుదల చేసిన జగన్
- చిత్రయూనిట్ కు జగన్ అభినందనలు
‘ఇదంతా ఎందుకు షూట్ చేశావు?’ అనే ప్రశ్నకు, ‘సార్..ఇక్కడ మనిషి చావు న్యూసే.. మనిషి జ్ఞాపకాలూ న్యూసే..ప్రేమా న్యూసే..స్నేహం న్యూసే.. చెయ్యాలనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ న్యూసే, అది ఎన్ క్యాష్ చేసుకోవడం తెలుసుకోండి..’ అనే సుమంత్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ డైలాగ్స్ లో సుమంత్ కెమెరామన్ పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్ గా పరిచయం కానుంది.