kalva srinivasulu: అలాంటి ఆయుధాన్ని జగన్ దుర్వినియోగం చేసుకుంటున్నారు: మంత్రి కాలవ

  • చంద్రబాబును తిట్టడం కోసమే జగన్ పాదయాత్ర
  • అద్భుతమైన ఆయుధం పాదయాత్ర
  • బీజేపీతో జగన్  దొంగ కాపురం అందరికీ తెలిసిందే

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి కాలవ శ్రీనివాసులు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును తిట్టడం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అండగా ఉంటానని చెప్పడానికి పాదయాత్ర అద్భుతమైన ఆయుధమని, అలాంటి ఆయుధాన్ని జగన్ దుర్వినియోగం చేసుకుంటున్నారని విమర్శించారు.

జగన్ పాదయాత్ర చేస్తుంటే, ఆయన ఆరోగ్యం ఏమవుతుందనే ఆందోళన కనీసం సొంత పార్టీ నేతలకైనా ఉందో లేదో తెలుసుకునేందుకు పీకే టీమ్ తో సర్వే చేయించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీతో జగన్ చేస్తున్న దొంగకాపురం అందరికీ తెలిసిందేనని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ మాత్రం కేంద్రంపై పోరాడుతుందని కాలవ మరోసారి స్పష్టం చేశారు. జగన్ నిర్మాణాత్మక పాత్ర పోషించకుంటే 2019లో వచ్చే సీట్లు కూడా రావని కాలవ అభిప్రాయపడ్డారు. 

kalva srinivasulu
Jagan
  • Loading...

More Telugu News