Kerala: నిత్యావసర వస్తువులు ఉంచడానికి స్థలం లేదు... ఇక పంపకండి!: కర్ణాటక

  • కర్ణాటకలో వరదలకు కొడగు జిల్లాలో భారీ నష్టం 
  • రిలీఫ్ మెటీరియల్ అందించి సహాయం చేసిన దాతలు 
  • నిత్యావసరాలు చాలని చెప్పిన ప్రభుత్వం

భారీ వర్షాలు, వరదలు అటు కేరళనే కాదు ఇటు కర్ణాటకను కూడా వణికించాయి. కర్ణాటక రాష్ట్రంలో వరదల ప్రభావంతో కొడగు జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. 8 మంది మరణించగా, 4 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. అయితే కర్ణాటక వాసులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకొచ్చారు. నిత్యావసర వస్తువులను, ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ ను ఇస్తున్నారు.

అయితే ఈ మెటీరియల్ ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతుండటంతో ప్రభుత్వం ఇక రిలీఫ్ మెటీరియల్ చాలని, వీలైతే సిఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బులు పంపమని విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు పంపిన నిత్యావసర వస్తువులకే స్థలం సరిపోవట్లేదని చెప్పిన కొడగు జిల్లా ఇన్‌ చార్జి మంత్రి ఎస్ఆర్ మహేష్ రిలీఫ్ ఫుడ్ మెటీరియల్‌ పంపించడాన్ని నిలిపివేయాలని కోరారు. దాతలు పంపిన ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ప్రజలకు సరిపోతాయని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News