uyyalavada narasimhareddy: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనవరాలి పెళ్లి వేడుక

  • హైదరాబాద్ లో సంజనరెడ్డి వివాహం
  • వరుడు చెన్నైకి చెందిన ప్రతాప్ రెడ్డి
  • పెళ్లికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడిన ధీశాలి ఉయ్యాలవాడ నరసంహారెడ్డి. ఆయన జీవిత చరిత్రతోనే మెగాస్టార్ చిరంజీవి 'సైరా' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆయన ముని మనవరాలు సంజనరెడ్డి వివాహం చెన్నైకి చెందిన ప్రతాప్ రెడ్డితో ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెషన్ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉయ్యాలవాడ వారసులు మాట్లాడుతూ, నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించాలని గతంలోనే తాము అనుకున్నామని చెప్పారు. ఈ విషయమై సుమన్, సాయికుమార్ లను సంప్రదించామని, కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదని చెప్పారు. ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్, సురేందర్ రెడ్డిలు నరసింహారెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు.     

uyyalavada narasimhareddy
great grand daughter
marriage
chiranjeevi
  • Loading...

More Telugu News