Kerala: కేరళకు ఏకంగా రూ.700 కోట్ల విరాళం!: యూఏఈ పాలకుల ఔదార్యం

  • పెద్ద మనసు చాటుకున్న యూఏఈ పాలకులు
  • కేరళకు భారీ సాయం ప్రకటించిన అరబ్ దేశం
  • కృతజ్ఞతలు తెలిపిన సీఎం విజయన్

కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని ఆదుకుంటామని గతంలోనే ప్రకటించిన యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు బిన్ రషీద్ మక్తూమ్.. తాజాగా తమ దేశం తరఫున ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారు. యూఏఈ ఓ దేశంగా విజయం సాధించడంలో కేరళ ప్రజల భాగస్వామ్యం మరచిపోలేమని ఆయన గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేరళకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా జాతీయ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మక్తూమ్ ప్రకటించారు.

యూఏఈ రూ.700 కోట్ల విలువైన సాయాన్ని ప్రకటించిన విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. తమపై ఎంతో ప్రేమ చూపిన యూఏఈ ప్రభుత్వానికి, పాలకులకు విజయన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కేరళ వరదలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ మొత్తం రూ.600 కోట్ల సాయం మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చించేందుకు అఖిల పక్షం ఈ రోజు సాయంత్రం తిరువనంతపురంలో భేటీ కానుంది.

Kerala
FLOOD
UAE
Rs.700 crores
  • Loading...

More Telugu News